Skip to main content

SCCL: జూనియర్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన

సింగరేణి(కొత్తగూడెం): జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 అభ్యర్థుల సర్టిఫికెట్లను అక్టోబ‌ర్ 3న‌ సింగరేణి ప్రధాన కార్యాలయంలో రిక్రూట్‌మెంట్‌ సెల్‌ జీఎం కట్టా బసవయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు.
SCCL
జూనియర్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన

సంస్థలో ఖాళీగా ఉన్న 177 ఎక్స్‌టర్నల్‌ పోస్టులకు గాను గతేడాది సెప్టెంబర్‌ 4న పరీక్ష నిర్వహించగా పలువురు మెరిట్‌ సాధించారు. వారిలో అక్టోబ‌ర్ 3న‌ 85 మంది సర్టిఫికెట్లు పరిశీలించగా బుధవారం 75 మంది సర్టిఫికెట్లు వెరిఫై చేయనున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేస్తామని జీఎం బసవయ్య తెలిపారు.

కార్యక్రమంలో ఏజీఎం కోడూరి శ్రీనివాస్‌, డీజీఎం వేణుగోపాలరావు, పర్సనల్‌ మేనేజర్‌ సివీఎస్‌ మూర్తి, డీవైపీఎంలు నాగేశ్వరరావు, కె.సంతోష్‌కుమార్‌, కె.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

SCCL: ఏటేటా.. ఉద్యోగులకు టాటా!

High Court: ‘సింగరేణి’ నియామకాలకు ఓకే

Published date : 04 Oct 2023 04:11PM

Photo Stories