సాక్షి, హైదరాబాద్: Telangana State Public Service Commission (TSPSC) నిర్వహించనున్న లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పరీక్షలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు.
రెండు భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించాలి
ఈమేరకు జనవరి 4న టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత సర్వీసుల పరీ క్షలు కూడా అభ్యర్థులు తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకుని రాసే వెసులుబాటు ఉందన్నారు.
జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్‌లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ రెండు భాషల్లో, ఆప్షనల్ పేపర్ ఆంగ్ల మాధ్యమానికే పరిమితం చేశారని తెలిపారు. దీంతో గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్రం నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించారని గుర్తు చేశారు.