Skip to main content

MHSRB: వైద్య పోస్టుల ర్యాంకుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య పోస్టుల భర్తీకి సంబంధించిన ర్యాంకుల జాబితాను మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నవంబర్‌ 9న విడుదల చేసింది.
MHSRB
వైద్య పోస్టుల ర్యాంకుల జాబితా విడుదల

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 211 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు కలిపి మొత్తం 969 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. వీటికి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఇతర అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ అభ్యర్థులకు వెయిటేజీ ఇచ్చారు. మొత్తంగా దరఖాస్తు చేసుకున్న 4,803 మంది ఎంబీబీఎస్‌ అభ్యర్థుల వివరాలతో మెరిట్‌ ప్రకారం జాబితాను విడుదల చేసినట్టు బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయి, వివరాలను పరిశీలించుకోవాలని.. ఏదైనా అభ్యంతరం ఉంటే తమ లాగిన్‌ నుంచే ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం బోర్డు వెబ్‌సైట్‌  https://mhsrb.telangana.gov.inను సందర్శించాలన్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని.. అనంతరం తుది జాబితా విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

చదవండి: YSRUHS: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు

ఇతర పోస్టుల భర్తీకీ గ్రీన్‌ సిగ్నల్‌

వైద్య, ఆరోగ్య రంగంలో మొత్తం 10,028 ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో తాజాగా 969 పోస్టులకు ర్యాంకుల జాబితాను ప్రదర్శించారు. మిగతా ఉద్యోగాలను పెంచిన గిరిజన రిజర్వేషన్లతో భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్‌ వైద్యులు, నర్సింగ్, ఏఎన్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కావాల్సి ఉంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ పూర్తయ్యాక వీటికి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి రోస్టర్‌ వివరాలు రాగానే దాదాపు 9 వేల పోస్టులకు విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. మొత్తంగా 900కుపైగా పోస్టులు గిరిజన వర్గాలకు దక్కనున్నాయి. 

చదవండి: Medical and Health Department: ఏపీలో జూడాలకు స్టైపెండ్‌ పెంపు

Published date : 10 Nov 2022 01:29PM

Photo Stories