Skip to main content

Gandhi Medical College jobs: 12వ తరగతి అర్హతతో గాంధీ మెడికల్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు

Gandhi Medical College jobs
Gandhi Medical College jobs

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ వద్ద ఉన్న గాంధీ మెడికల్ కాలేజీ VRDL మరియు MRU విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది..

Tally లో ఉచిత శిక్షణ జీతం 15వేలు: Click Here

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, అప్లికేషన్ తో పాటు సంబంధిత ధృవపత్రాలు తో 500 అప్లికేషన్ ఫీ DD తీసి ప్రిన్సిపల్ GMC, సికింద్రాబాద్ వారికి సబ్మిట్ చేయాలి.

అప్లై చేయడానికి చివరి తేది: 
05/10/2024 సాయంత్రం 5:00 గంటల లోపు 10:30 నుండి 4:00 గంటల లోపు ప్రిన్సిపల్ పేషి, GMC నందు అభ్యర్థులు స్వయంగా అందజేయాలి.

భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో సైంటిస్ట్ C, DEO, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్టు అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలు భర్తీకి 08/10/2024 న ఉదయం 11:00 నుండి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

భర్తీ చేయబోయే ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్

భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సైంటిస్ట్ C,DEO, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్టు అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్

అర్హతలు : 12th class మరియు పోస్టులను అనుసరించి డిగ్రీ పీజీ వంటి అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 12

సైంటిస్ట్-సి (మెడికల్/నాన్-మెడికల్) – 03
MRU: 1 పోస్ట్
VRDL: మెడికల్ – 01 పోస్టు, నాన్ మెడికల్ – 01 పోస్టు
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 02
MRU: 1 పోస్ట్
VRDL: 1 పోస్ట్
రీసెర్చ్ అసోసియేట్-II
MRU: 1 పోస్ట్
ప్రాజెక్ట్ అసిస్టెంట్
MRU: 1 పోస్ట్
VRDL: 1 పోస్ట్
రీసెర్చ్ అసిస్టెంట్
VRDL: 1 పోస్ట్
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్-III
VRDL: 1 పోస్ట్
ల్యాబ్ టెక్నీషియన్
VRDL: 1 పోస్ట్

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు :
అప్లై చేయడానికి చివరి తేది: 05/10/2024 సాయంత్రం 5:00 గంటల లోపు,

ఇంటర్వ్యూ తేది: 08/10/2024.

జీతం: పోస్టులను అనుసరించి ₹20,000 నుండి ₹67,000 వరకు జీతముతో పాటు HRA కూడా వర్తిస్తుంది.

వయస్సు :
01-06-2024 నాటికి ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 నుండి 40 సంవత్సరాలు వరకు ఉంటుంది. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ, బీసీ ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇస్తారు.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇస్తారు.

ముఖ్యాంశాలు:
11 నెలలకు గాను కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసిన ఉద్యోగాలు GMC కి పరిమితం అయి వుంటాయి.

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తారు.
 

Published date : 02 Oct 2024 06:58PM

Photo Stories