Medical and Health Department: ఏపీలో జూడాలకు స్టైపెండ్ పెంపు
Sakshi Education
జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని జూనియర్ డాక్టర్లకు ప్రతి నెలా అందిస్తున్న స్టైపెండ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన స్టైఫండ్‌ను 2022 జనవరి నుంచి వర్తింపజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చదవండి: 400 Andhra Pradesh Govt Jobs: ఎవరు అర్హులంటే..
రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య, రెండు ప్రభుత్వ దంత వైద్య కళాశాలల్లో హౌస్ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ఈ స్టైపెండ్ పెంపు వర్తిస్తుంది.
Published date : 22 Oct 2022 01:29PM