Department of Medicine: పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన 400కు పైగా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి మూడు రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ నిర్ణయించింది. తొలి రోజు డీఎంఈలో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, వాసు్కలర్ సర్జన్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రినాలజీ, మెడికల్ గ్యాస్ట్రో–ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో–ఎంటరాలజీ, మెడికల్ అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, నియోనాటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీకి సంబంధించిన పోస్టులకు ఇంటర్వ్యూ చేస్తారు. అదే విధంగా ఏపీవీవీపీలో అనస్తీషియా, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, రేడియాలజీ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
చదవండి: MBBS: హిందీలో పాఠ్యపుస్తకాలు
కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్‌కు నెలకు రూ.1.30 లక్షలు, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కు రూ.1.60 లక్షలు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్‌కు రూ.1.60 లక్షల చొప్పున వేతనాలు నిర్ణయించారు. ఇంటర్వ్యూల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీవీవీపీ కమిషనర్, ఇన్‌చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. గర్భిణులు, బాలింతలు, ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న అభ్యర్థులు వారి తరఫున కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూకు హాజరైనా అనుమతిస్తామన్నారు.
చదవండి: Family doctors: లక్షకుపైగా కుటుంబాలకు సమకూరనున్న ‘ఫ్యామిలీ డాక్టర్లు’
పలు స్పెషాలిటీల్లో ఖాళీలు ఇలా (డీఎంఈలో)
- రేడియాలజీ – 17
- ఎమర్జెన్సీ మెడిసిన్ – 16
- ఫోరెన్సిక్ మెడిసిన్ – 13
- పాథాలజీ – 13
- కార్డియాలజీ - 12
- యూరాలజీ – 09
- న్యూరో సర్జరీ – 08
- పీడియాట్రిక్ సర్జరీ – 04
(ఏపీవీవీపీలో)
- జనరల్ మెడిసిన్ – 34
- రేడియాలజీ – 24
- జనరల్ సర్జరీ – 13
- పీడియాట్రిక్స్ – 09