Skip to main content

Coaching with Stipend : పోటీ ప‌రీక్ష అభ్యర్థుల‌కు శిక్ష‌ణ‌తో స్టైఫండ్‌..

వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే వేలకు వేల రూపాయాలు వెచ్చించి ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి.
Free coaching classes for competitive exam candidates with stipend  YSRCP government job training session for SC, ST, BC youthBC study circle providing basic facilities for competitive exam preparation  Training with expert tutors for competitive exams under YSRCP government  Newly formed coalition government and future incentives for competitive exam candidates

అనంతపురం: వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే వేలకు వేల రూపాయాలు వెచ్చించి ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ, గ్రూప్‌ 1, 2, సచివాలయ, రైల్వే, బ్యాంకింగ్‌ ఉద్యోగాలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయాల్లో ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయించారు. అయితే గత ఐదేళ్లలో బీసీ స్టడీ సర్కిళ్లలో మౌలిక వసతులు కల్పించి నిష్ణాతులైన ట్యూటర్లతో శిక్షణ ఇప్పించడంతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

Maldives President: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు.. ఎందుకంటే..

శిక్షణతో పాటు స్టైఫండ్‌..

పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడానికి ప్రతి బ్యాచ్‌కు అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి 200 మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. వీరిలో 66 శాతం సీట్లు బీసీలకు, 20 శాతం సీట్లు ఎస్సీలకు, 14 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తున్నారు. శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వడంతో ఉచితంగా మెటీరియల్‌, నెలకు రూ. 1500 చొప్పున రెండు నెలల పాటు స్టైఫండ్‌ అందిస్తుండటంతో శిక్షణ పొందటానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోటీ పరీక్షలకు హజరయ్యే వారికి అందించిన ప్రోత్సాహాన్ని కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం అందిస్తుందా? లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.

JNV Admission Notification 2025 : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల‌కు నోటిఫికేషన్‌ విడుదల.. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ‌తో..

Published date : 29 Jul 2024 12:50PM

Photo Stories