నేషనల్ మీన్స్–కం–మెరిట్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ మీన్స్–కం–మెరిట్ స్కాలర్‌షిప్‌కు సంబంధించి డిసెంబర్ 18న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని విడుదల చేసినట్లు తెలంగాణ పాఠశాల విద్య పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
8–12 తరగతుల విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం ఇచ్చేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి ఈ పరీక్షకు 33,900 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 32,807 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. ప్రాథమిక ‘కీ’కోసం విద్యార్థులు http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 29వ తేదీలోగా dirgovexams.tg@gmail.com మెయిల్‌కు పంపాలని పేర్కొన్నారు.
చదవండి:
Pre Matric Scholarship: 9, 10 తరగతులకే: కేంద్రం
CBSE Scholarships: బాలికలకు సీబీఎస్‌ఈ ఆర్థిక చేయూత.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Published date : 21 Dec 2022 12:40PM