IIIT: రెగ్యులర్ పోస్టుల భర్తీ

వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో జూలై 29న ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు ట్రిపుల్ ఐటీలలో వివిధ టీచింగ్, నాన్ టీచింగ్‌కు సంబంధించి 665 పోస్టులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఏడాదిలోగా ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను పూర్తి స్థాయిలో రూపకల్పన చేయాలన్నదే లక్ష్యమన్నారు. ట్రిపుల్ ఐటీల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యనందించాలనే ఉద్దేశంతో 12 వేల ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశామని, నెలలో విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు అందిస్తామని చెప్పారు. అలాగే ప్రతి క్యాంపస్‌లోనూ క్వాలిటీతో కూడిన మెస్‌లుండేలా అధికారులు మానిటర్ చేస్తున్నట్టు తెలిపారు. ట్రిపుల్ ఐటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఆగస్ట్‌లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మండలాల ప్రాతిపదికన ప్రతి మండలానికి కనీసం రెండు సీట్లు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జీతాలు, మెస్ బిల్లులు, మౌలిక వసతులు తదితర వాటికి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో ప్రతిభ చూపేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని.. ఆగస్ట్ ఒకటి నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామని.. ప్రత్యేక అధికారినీ నియమించినట్టు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాల చెల్లింపులో ఎవరికీ అన్యాయం జరగకుండా ఒక కమిటీ వేశామని, ఆగస్ట్ 4న సమావేశం నిర్వహిస్తామని కాంట్రాక్టు అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో చెంచురెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో డైరెక్టర్ కె.సంధ్యారాణి, ఓఎస్డీ వైఎస్ గంగిరెడ్డి పాల్గొన్నారు.
చదవండి: