Skip to main content

Jobs: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఉద్యోగ నియామకాలకు అనుమతి

క‌రోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల‌ కుటుంబాల‌కు కారుణ్య నియామ‌కాల‌ను వ‌ర్తింప‌చేయ‌డానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
Permission for compassionate job recruitment
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఉద్యోగ నియామకాలకు అనుమతి

అయితే ఈ కారుణ్య నియామ‌కాల ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వ‌ర్కర్ల కుటుంబ స‌భ్యుల‌కే ఉంటుంద‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం ఇచ్చేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో కారుణ్య నియామకం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి దరఖాస్తులను పరిష్కరించి తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.

చదవండి: 

Good News : ఈ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే

Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

Published date : 19 Jan 2022 11:54AM

Photo Stories