Skip to main content

Good News : ఈ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ డిసెంబ‌ర్ 28వ తేదీన 730 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెల్సిందే.
APPSC
APPSC

అయితే ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించారు.
రెవిన్యూ శాఖ‌లోని 670 జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ కంప్యూట‌ర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే దేవదాయ శాఖ‌లోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ జారీచేసిన‌ట్టు విష‌యం తెల్సిందే. డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 19వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు తాజాగా ద‌ర‌ఖాస్తు గ‌డువును జ‌న‌వ‌రి 29 తేదీ వ‌ర‌కు పొడిగించారు. అలాగే జ‌న‌వ‌రి 28 తేదీ అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఫీజు చెల్లింపులు చేసుకోవ‌చ్చ‌ని ఏపీపీఎస్సీ తెలిపింది. నిరుద్యోగుల విన్నపం మేరకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 

పోస్టుల వివ‌రాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 730
పోస్టు: జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌(రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌): 670
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్‌ నిర్వహించే కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. 
వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

పోస్టు: ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3(ఎండో మెంట్స్‌ సబ్‌ సర్వీస్‌): 60
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

ముఖ్య సమాచారం : 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.01.2022
ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ :  28.01.2022

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

APPSC Jobs‌: రెవెన్యూ, దేవాదాయ శాఖలో.. కొలువు సాధించండి.. ఇలా!

670 Posts: గ్రూప్‌-4 ఉద్యోగాన్ని కొట్టే సులువైన మార్గాలు..|| Junior Assistant Cum Computer Assistant Exam Tips

జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ కంప్యూట‌ర్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి

ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టుల నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి

ఎండోమెంట్‌ గ్రేడ్‌–3 ఆఫీసర్ ఉద్యోగం సాధించ‌డం ఎలా..?

ఏపీపీఎస్సీ పోస్టుల మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, బిట్‌బ్యాంక్‌, జీకే, క‌రెంట్ అఫైర్స్‌, సిల‌బ‌స్‌, స్ట‌డీమెటీరియ‌ల్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

వీటిపై ప‌ట్టు... ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్ కొట్టు

Published date : 18 Jan 2022 07:42PM

Photo Stories