1,458 Jobs: ‘సీనియర్ రెసిడెంట్’ల నియామకానికి నోటిఫికేషన్.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే
నవంబర్ 19వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 45 ఏళ్ల లోపు వయసుండి, ప్రభుత్వ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. http://dme.ap.nic.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: Medical and Health Department: ఈ లోగా ఖాళీలను భర్తీ చేయండి
ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్‌ఆర్‌లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది.
చదవండి: Medical and Health Department: ఏపీలో జూడాలకు స్టైపెండ్ పెంపు
పీజీ తుది పరీక్షల్లో వచ్చిన మెరిట్(థియరీ, ప్రాక్టికల్స్) ప్రామాణికంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్ మెడిసిన్‌లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101 ఖాళీలు న్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మ కాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్‌ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ప్రభుత్వం 46 వేల పోస్టులను భర్తీ చేపట్టింది.
చదవండి: 400 Andhra Pradesh Govt Jobs: ఎవరు అర్హులంటే..
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే..
ఎస్‌ఆర్ పోస్టుల నియామకంలో తమకు అవకాశం కల్పించాలని కొందరు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ చేసిన వైద్యులు సంప్రదిస్తున్నారు. అయితే నేషన్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) అడ్మిషన్ నిబంధనల మేరకు కళాశాలల్లోని ప్రతి విభాగంలో ఎస్‌ఆర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఈ క్రమంలో కేవలం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే అవకాశం కల్పిస్తున్నాం. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివిన వారు తాము చదివిన కళాశాలల్లో ఎస్‌ఆర్‌లుగా పనిచేసేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలను సంప్రదించాలి.
– డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ