Medical and Health Department: ఈ లోగా ఖాళీలను భర్తీ చేయండి
నవంబర్ 20వ తేదీ లోగా జిల్లాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని శ్యాక్స్ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో నవీన్‌కుమార్ నవంబర్ 11న సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నియామకాలు చేపట్టామని, వీటిలో భర్తీ అవ్వకుండా మిగిలిన ఖాళీలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలని చెప్పారు.
చదవండి: NIMS Recruitment 2022: నిమ్స్, హైదరాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.80 వేల వేతనం..
ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాకో తాజా ఆదేశాల మేరకు జిల్లాల్లో సెంట్రల్ నోడల్ ఏజెన్సీ బ్యాంక్ అకౌంట్(ఎస్‌ఎన్‌ఏ)ను తెరవాలన్నారు. శ్యాక్స్ నుంచి నిధులు పొందాలంటే ఎస్‌ఎన్‌ఏ తప్పనిసరి అన్నారు. ఏఆర్‌టీ మందులు మధ్యలో వాడడం మానేసిన రోగులను గుర్తించాలన్నారు. సమీక్షలో శ్యాక్స్ ఏపీడీ డాక్టర్ కామేశ్వరరావు, పెప్ ఫర్ కోఆరి్డనేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.