Skip to main content

Barrelakka (Karne Shireesha): నిరుద్యోగుల పక్షాన నామినేషన్

మాది నాగర్‌కర్నూల్‌ జిల్లా, పెద్ద కొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామం. నేను పీజీ చేస్తున్నా.
Barrelakka, sirisha

‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. అందుకే మా అమ్మకు చెబితే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్‌’ అంటూ రెండేళ్ల కిందట నేను చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

నా వీడియో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని నా మీద కేసు పెట్టారు. సాటి నిరుద్యోగుల కోసం పోరాటం చేయడానికి నిశ్చయించుకుని నామినేషన్‌ వేశా. నేను ఊహించనంత రెస్పాన్స్‌ వస్తోంది.

చదవండి: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులు వీరే.. జిల్లాల వారీగా..

ఆర్థిక సహాయం చేస్తున్నారు. మొదట్లో నన్ను ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకోవడానికి చూశారు కొందరు నాయకులు.

ఇప్పుడు నా తమ్ముడి మీద దాడి చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగుల తరపున పోరాటాన్ని కొనసాగిస్తాను. 
–  బర్రెలక్క, శిరీష (పీజీ), కొల్లాపూర్, ఇండిపెండెంట్‌

Published date : 25 Nov 2023 04:23PM

Photo Stories