Skip to main content

Jobs: సింగరేణిలో ఉద్యోగాల భర్తీ

సింగరేణి వచ్చే ఏడాది 177 జూనియర్‌ అసిస్టెంట్, 39 మైనింగ్‌ ఇంజనీర్, 10 ఇండ్రస్టియల్‌ ఇంజనీర్, 6 ఐటీ ఇంజనీర్‌తో పాటు ఇతర కేటగిరీల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
singareni
సింగరేణిలో ఉద్యోగాల భర్తీ

ఏడేళ్ల కాలంలో 58 ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ల ద్వారా 3,498, కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా 12,553 కలిపి మొత్తం 16,040 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సింగరేణి సంస్థ డిసెంబర్‌ 28న ఒక ప్రకటనలో తెలిపింది. ఒత్తిళ్లతో అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందని ఇంటర్వూ్యల విధానాన్ని పూర్తిగా తొలగించి కేవలం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరించింది. రాత పరీక్ష జరిగిన రోజునే ఫలితాలు వెల్లడించి, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొంది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌ తెలిపారు. 

చదవండి: 

సింగరేణి రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు

సింగరేణి ఉద్యోగులకు నూతన గృహాలు.. ఏడాదిలోగా 1,478 ఇళ్ల నిర్మాణం: సీఎండీ శ్రీధర్

సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు మహంతం పురస్కార్

Published date : 29 Dec 2021 03:47PM

Photo Stories