సింగరేణి రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 8న జరగనున్న ఫిట్టర్ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సింగరేణి సంస్థ తెలిపింది.
పరీక్షలు రాయడానికి వచ్చే అభ్యర్థులను మెటల్ డిటెక్టర్ ద్వారాల గుండా పంపించి.. పూర్తి పరిశీలన తర్వాతే కేంద్రాల లోపలికి అనుమతిస్తామని స్పష్టంచేసింది. అభ్యర్థుల వద్ద ఎలాంటి సూక్ష్మ లోహపు వస్తువు ఉన్నా మెటల్ డిటెక్టర్ పట్టేస్తుందని, పరీక్షలు రాసే అభ్యర్థులలో కొందరు అక్రమాలకు పాల్పడకుండా నివారించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నామని సింగరేణి సంస్థ వెల్లడించింది. 128 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న రాత పరీక్షకు కొత్తగూడెంలో 5 పరీక్ష కేంద్రాలలో పూర్తి ఏర్పాట్లు చేశామని, 2,681 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని వివరించింది. సంస్థ జీఎం (సెక్యూరిటీ) కుమార్ రెడ్డి, డైరెక్టర్ ఎన్.బలరాం శుక్రవారం మెటల్ డిటెక్టర్లను పరిశీలించారు.
Published date : 07 Aug 2021 03:36PM