Skip to main content

Jobs: సిమ్స్‌లో నేటినుంచి ఇంటర్వ్యూలు

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైసెన్స్‌(సిమ్స్‌)లో కాంట్రాక్టు పద్ధతిన 141 పోస్టులను భర్తీ చేయడానికి ప్రొఫెసర్ల నుంచి ట్యూటర్ల వరకు అర్హతగలవారు ఇంటర్‌ూయ్వలకు హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు.
Interviews from today on The Sims

ఆగ‌స్టు 16‌ నుంచి 26వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 10మంది ప్రొఫెసర్లు, 25 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 57 మంది సీనియర్‌ రెసిడెంట్‌, 25 మంది ట్యూటర్లను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు చేపట్టారు.

చదవండి: Singareni Jobs: సింగరేణిలో మహిళలకూ ‘కారుణ్యం’

సింగరేణికి అనుకూలంగా కోర్టు తీర్పు

గోదావరిఖని: సింగరేణి క్వార్టర్లు ఖాళీ చేయడంలో యాజమాన్యానికి అనుకూలంగా కోర్టు తీర్పువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హైకోర్టుకు వెళ్లిన 26మంది కార్మికులు 15రోజుల్లోగా క్వార్టర్లు ఖాళీ చేసి కొత్త క్వార్టర్లు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్జీ–1 అధికార ప్రతినిధి కిరణ్‌బాబు తెలిపారు.

కార్మికులు వేసిన రెండు పిటిషన్లు కొట్టివేసినట్లు, గోదావరిఖని జూనియర్‌ సివిల్‌ జడ్జి సమక్షంలో 15రోజుల్లోగా క్వార్టర్లు కేటాయించాలని సూచించినట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పు మేరకు రోడ్ల విస్తరణ కార్యక్రమం వేగవంతం చేయనున్నామన్నారు.

Published date : 16 Aug 2024 01:15PM

Photo Stories