Competitive Exams: పోటీ పరీక్షలకు సమస్యల సమరం
చదువు కోసం ‘పోటీ’
ఈ చిత్రంలో కనిపిస్తున్న వారంతా సినిమా టికెట్ల కోసమో.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకో బారులు తీరారనుకుంటే పొరబడినట్లే.. వీరంతా నిరుద్యోగులు. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడంతో పోటీ పరీక్షలకు సన్నద్ధ్దమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో రోజూ 300 మంది నిరుద్యోగులు చదువుకొనేందుకు సౌకర్యం ఉండగా, సామర్థ్యానికి మించి వస్తున్నారు. దీంతో ముందు వచ్చిన వారికే అక్కడ చదువుకోవడానికి సీటు దొరుకుతోంది. సీటు దొరకని వారు తిరిగి ఇంటికి వెళ్లాల్సిందే.. దీంతో సీటు కోసం రోజూ ఉదయం 5 గంటలకే వచ్చి ఇలా బారులు తీరాల్సి వస్తోంది.
ఆదిలాబాద్
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలకు బారులు తీరుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయానికి రోజూ 700 మంది వరకు వస్తున్నారు. కానీ వివిధ సబ్జెక్టులకు సంబంధించి తాజా పుస్తకాలు అరకొరగానే ఉన్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బెంచీలు, ఫ్యాన్ల కొరత పక్కన పెడితే పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఒక్కొక్కటే మరుగుదొడ్డి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలపై మంగళవారం నిరుద్యోగ యువతీ యువకులు గ్రంథాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.
ఖమ్మం
చదవండి:
Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!