Department of School Education: ఉపాధ్యాయ సీనియారిటీపై కసరత్తు
రాష్ట్ర ఉన్నతాధికారులు సీనియారిటీ రూపకల్పనలో తలమునకలవుతున్నారు. వీలైనంత త్వరగా బోధన, బోధనేతర సిబ్బంది సీనియారిటీ జాబితాలను పంపాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను డిసెంబర్ 7న ఆదేశించారు. దీంతో జిల్లా స్థాయి అధికారులూ మండల విద్యాధికారులపై ఒత్తిడి పెంచారు. సీనియారిటీ జాబితాను డిసెంబర్ 8న సమీకరించాలని అన్ని ప్రభుత్వ శాఖలు నిర్ణయించాయి. విద్యాశాఖలో జాబితా రూపకల్పనకు గడువు కోరే వీలుందని ఓ అధికారి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 1.09 లక్షల మంది వివరాలు సేకరించాల్సి ఉందని, హడావుడిగా జాబితాను రూపొందించడం కష్టమంటున్నారు. సీనియారిటీ ఆధారంగానే జిల్లాల వారీ కేటాయింపులుంటాయి కాబట్టి కొంత జాప్యం తప్పదని ఓ జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.
చదవండి:
Teachers: దశలవారీగా ఇంగ్లిష్‌పై శిక్షణ
KGBV: పోస్టుల భర్తీకి పక్కా రూల్స్
958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వాటి వివరాలు