అభ్యంతరాల స్వీకరణ గడువు తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టుల భర్తీలో భాగంగా ఇటీవల 4,033 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేశారు.
ఆగస్టు 12తో ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువును ఆగస్టు 16వ తేదీ వరకూ పొడిగిస్తూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా డాక్యుమెంటరీ ఆధారాలతో అభ్యంతరాలను casrecruitmentdphfw22@gmail.comకు మెయిల్ ద్వారా పంపాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. గడువు అనంతరం అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని చెప్పారు.
చదవండి:
Published date : 15 Aug 2022 03:56PM