Skip to main content

మెడికల్ ప్రొఫెసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 32 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయనున్నారు.
వాస్తవానికి వీరంతా 2017లోనే రిటైర్ కావాల్సి ఉంది. కానీ.. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 63 ఏళ్లకు పెంచుతూ జీవోలు ఇప్పించారు. దీంతో వారికి మూడేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఏర్పడింది.
  • కొత్త వారిని నియమించేందుకు మొగ్గు
  • పదవీ విరమణ వయసును పెంచడం కంటే.. కొత్త వారిని నియమించేందుకే సర్కారు మొగ్గు చూపుతోంది.
  • రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 9,700 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
  • పస్తుత కరోనా వైరస్ విపత్తు సమయంలో యువకులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ చదువుతున్న వైద్యులే ప్రాణాలకు తెగించి పని చేశారు.
  • చాలామంది సీనియర్లు 60 ఏళ్లు దాటాయన్న కారణంగా కోవిడ్ విధుల్లో పాల్గొనలేదు.
  • మరోవైపు ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయడం వల్ల నష్టమేమీ ఉండదని, అసోసియేట్‌లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభిస్తే ఆ లోటును తాము భర్తీ చేస్తామని అసోసియేట్ ప్రొఫెసర్లు చెబుతున్నారు.
  • పస్తుతం ఒక ప్రొఫెసర్‌కు చెల్లించే వేతనంతో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తారని.. అందువల్ల కొత్త నియామకాలే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  • పొఫెసర్లు పదవీ విరమణ చేయడం వల్ల ఎక్కువ మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభిస్తాయని చెబుతున్నారు.
మూడు నెలల్లో 32 మంది..
  • ఈ నెల 31 నాటికి ఆరుగురు, జూన్ 30 నాటికి మరో 12 మంది, జూలై 31 నాటికి 8 మంది, ఆగస్టు 31 నాటికి మరో ఆరుగురు పదవీ విరమణ చేయనున్నారు.
  • ఇదిలా ఉండగా కొంతమంది సీనియర్ వైద్యులు మరో రెండేళ్ల పాటు పదవీ విరమణ వయసు పెంచేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు వైద్య విద్యా శాఖలో ప్రచారం జరుగుతోంది.
Published date : 26 May 2020 04:01PM

Photo Stories