Skip to main content

Civil Assistant Surgeon: పోస్టులకు కౌన్సెలింగ్ తేదీ ఇదే..

వైద్య, ఆరోగ్య శాఖలోని Civil Assistant Surgeon(CAS) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్‌ 19న కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
Civil Assistant Surgeon
సీఏఎస్ పోస్టులకు కౌన్సెలింగ్ తేదీ ఇదే..

డీహెచ్, ఏపీవీవీపీ, డీఎంఈలోని 846 సీఏఎస్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి ఎంపికైన వారితో తొలి జాబితా విడుదల చేసింది. వీరిలో 586 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. అయితే కొందరు ఇంకా విధుల్లో చేరలేదు. దీంతో మిగిలిన పోస్టుల భర్తీ కోసం రెండో జాబితాను విడుదల చేసింది.

చదవండి: MBBS: హిందీలో పాఠ్యపుస్తకాలు

వీరంతా ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో గొల్లపూడిలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయంలో అక్టోబర్‌ 19న కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా గైర్హాజరైతే.. ఎలాంటి నోటీసులు లేకుండా వారి ఎంపికను రద్దు చేస్తామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్‌ రామిరెడ్డి తెలిపారు. వారికి బదులు తర్వాతి స్థానాల్లోని వారికి అవకాశం ఇస్తామన్నారు. 

చదవండి: NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు

Published date : 18 Oct 2022 03:44PM

Photo Stories