295 Jobs: మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
గత డిసెంబర్ ఆరో తేదీన 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఆయా పోస్టులకు 2,900 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతోంది. అనంతరం మెరిట్ జాబితా విడుదల చేసి నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా వాటికి అదనంగా మరో 295 పోస్టులను కలుపుతారు. తాజాగా పోస్టుల అనుమతితో కలిపి మొత్తం 1,442 పోస్టులను భర్తీ చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
చదవండి: TS Government Jobs 2023 : త్వరలోనే 1,400 అసిస్టెంట్ పోస్టుల భర్తీ..
ఆయా ఉద్యోగస్తుల వేతన స్కేల్ రూ. 68,900 నుంచి రూ. 2,05,500గా ఖరారైంది. ప్రస్తుతం ప్రకటించిన పోస్టుల్లో 45 గైనకాలజీ, 33 జనరల్ మెడిసిన్, 32 జనరల్ సర్జరీ, 22 అనెస్థీషియా, 11 అనాటమీ, 11 బయో కెమిస్ట్రీ, 17 కమ్యూనిటీ మెడిసిన్ (ఎస్‌పీఎం), 10 ఆస్పత్రి అడ్మిన్, 11 మైక్రోబయోలజీ, 10 ఆర్థోపెడిక్స్, 17 పీడియాట్రిక్స్, 17 పాథాలజీ, 11 ఫిజియోలజీ, 10 రేడియో డయాగ్నొసిస్ తదితరాలు ఉన్నాయి. అన్ని పోస్టులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహిళా అభ్యర్థులకు అన్ని కేటగిరీల్లో 33.3 శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది.
చదవండి: NIT Recruitment 2023: నిట్, హమిర్‌పూర్‌లో 62 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు