MLHP: కొనసాగుతున్న ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీ ప్రక్రియ
డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో సేవలు అందించడానికి 1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ నెలలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. సుమారు 12 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 10,790 మంది పరీక్ష రాశారు. ఎంపిక పరీక్షలో వచి్చన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటివరకు నాలుగు జోన్‌లలో 1,013 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఎంపికైన కొందరు అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినప్పటికీ సర్టిఫికెట్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) చేయలేదు.
చదవండి: MHSRB: వైద్య పోస్టుల ర్యాంకుల జాబితా విడుదల
ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఉమ్మడి జిల్లాల్లోని ఇగ్నో శిక్షణ కేంద్రాల్లో మూడు నెలల పాటు సీపీసీహెచ్ శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. గ్రామ స్థాయిలోనే ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడం కోసం 10,032 విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమిస్తున్నారు. కాగా వీరికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్‌వో)గా ప్రభుత్వం హోదా కల్పించింది.
చదవండి: YSRUHS: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు