Telangana: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వయోపరిమితి పెంపు
ఆసుపత్రులు/సంస్థలు/ అరోగ్య కార్యక్రమాల్లో పనులు చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత అవకాశాలు పెంచేలా ఎంపిక ప్రక్రియలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇప్పటి వరకు ఉన్న గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలకు పెంచింది. ఇప్పటికే నోటిఫై చేయబడిన 1520 ఖాళీలతో పాటు, మరో 146 ఖాళీలు గుర్తించింది. మొత్తం 1666 కి పోస్టుల సంఖ్య పెంచింది.
చదవండి: National Medical Commission: 10 లక్షల జనాభాకు ఇన్ని ఎంబీబీఎస్ సీట్లు
ఇంతకుముందు రాత పరీక్షకు 80 పాయింట్లు, సర్వీసుకు 20 పాయింట్లు వెయిటేజి ఉండగా, ఇప్పుడు రాత పరీక్షకు 70 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు గాను గరిష్టంగా 30 పాయింట్లు నిర్దేశించింది. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించే వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సేవలు అందించే వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇవ్వాలని నిర్ణయం.
కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెంబర్ సెక్రటరీ MHSRB ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్య తీసుకోవాలని ఆదేశించింది.
ఈ విషయాన్ని ట్విట్ చేసిన మంత్రి హరీశ్ రావు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Good news for aspiring Multi Purpose Health Assistants - MPAH(F)s !
— Harish Rao Thanneeru (@BRSHarish) August 19, 2023
Hon’ble CM Shri KCR garu directed to increase Age limit from 44 to 49.
Vacancies increased from 1,520 to 1,666. Service weightage increased from 20 marks to 30 marks for MPHA (F) recruitment through MHSRB.… pic.twitter.com/cIgn504CUu