National Medical Commission: 10 లక్షల జనాభాకు ఇన్ని ఎంబీబీఎస్ సీట్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇకపై 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది.
ఈ మేరకు 2024–25 విద్యా సంవత్సరం నుంచి కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించి కనీస ప్రామాణిక అవసరాలు (మినిమమ్ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్స్)–2023 మార్గదర్శకాలను ఎన్‌ఎంసీ ఆగస్టు 18న విడుదల చేసింది. అదే విధంగా.. 2024–25 విద్యా సంవత్సరానికి నూతన కళాశాలల ఏర్పాటు, మెడికల్ సీట్ల పెంపునకు దరఖాస్తులను ఆహ్వానించారు.
ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం..
- ఇకపై కొత్త వైద్య కళాశాలల్లో 50, 100, 150 సీట్ల వరకే అనుమతిస్తారు.
- ఎంబీబీఎస్ విద్యార్థులు, కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బందికి ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని అమలుచేస్తారు. ప్రతి ఒక్కరికీ ఏడాదికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి.
- కళాశాల, బోధనాసుపత్రులకు వేర్వేరు భవనాలు ఉన్నట్లయితే వాటి మధ్య దూరాన్ని గరిష్టంగా 30 నిమిషాల్లో చేరేలా ఉండాలి.
- బోధనాస్పత్రిలో కనీసం 220 పడకలుండాలి.
- కళాశాలల్లో కచ్చితంగా 21 విభాగాలు ఉండాల్సిందే.
- కొత్తగా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ రీసెర్చ్‌ను.. సిబ్బంది పిల్లల కోసం చైల్డ్‌కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలి.
- మూడు మ్యూజియంలు ఉండాలి. అందులో ఒకటి అనాటమీ, రెండు.. పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్.. మూడోది ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిíÜన్కు కేటాయించాలి. వీటితో పాటు లైబ్రరీ, స్కిల్ ల్యాబొరేటరీ సదుపాయాలుండాలి.
- కళాశాలకు అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రాలు/కమ్యూనిటీ హెల్త్/అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండాలి.
- ఒక్కో కేంద్రంలో 15 మంది చొప్పున విద్యార్థులను ఇంటరన్స్‌గా పోస్ట్ చేయాలి.
Published date : 19 Aug 2023 01:05PM