బాన్సువాడ:బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం అధ్వానంగా మారింది. పట్టణంలో నడిఒడ్డున ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు వెళ్లే దారులు కూడా ఇంత ఆధ్వానంగా ఉండవంటే నమ్మండి. కనీసం ప్రార్థన చేసేందుకు కూడా స్థలం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తరగతి గదుల్లోనే ప్రార్థనలు చేస్తున్నారు. అధికారులు స్పందించిన పాఠశాల ప్రాంగణ దుస్థితిపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.