Skip to main content

Teacher's Transfer:ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప‌దోన్న‌తులకు ప‌రిశీల‌న‌

ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప‌దోన్న‌తుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు ముగిసాయి. ఇక ఈనెల నుంచి స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న‌కు డీఈఓ ప్రోసీడింగ్ ఇచ్చారు. బ‌దిలీల కోసం ప‌రిశీలించే స‌ర్టిఫికెట్లు, వాటికి సంబంధించి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోండి.
Transfers and Promotions of teachers
Transfers and Promotions of teachers

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియంతా ఆన్‌లైన్‌లో సాగుతుండగా.. ఒకట్రెండు వచ్చే గ్రీవెన్స్‌ (అభ్యంతరాల పరిశీలన)కు 24 మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వెరిఫికేషన్ (డిప్యూటేషన్‌) పేరిట రోజుల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌లో ఈ నెల 3 నుంచి 5 వరకు పూర్తయింది. 6, 7, 8వ తేదీల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రతులను డీఈవో కార్యాలయంలో సమర్పించారు. ఈ నెల 6 నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ (వెరిఫికేషన్‌ టీం) ఇస్తూ డీఈవో ప్రోసిడింగ్‌ ఇచ్చారు.

Counselling at Gurukul Schools: త‌ర‌గ‌తుల సీట్ల భ‌ర్తీ కోసం స్పాట్ అడ్మిష‌న్

ఎనిమిది మంది ప్రధానోపాధ్యాయులు, వీరికి సహాయకులుగా 12 మంది ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యే వరకు డీఈవో కార్యాలయంలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. 6 నుంచి 8 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ముగిసిపోవడం, మిగిలిన అభ్యంతరాల నుంచి సీనియార్టీ జాబితా ప్రదర్శనకు వరకు అంతా ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఒకటి రెండు గ్రీవెన్స్‌కు వస్తే నలుగురు ఉంటే సరిపోతుంది. కానీ, పని లేకున్నా అందరూ అక్కడే ఉంటూ బడికి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

బోధనపై ప్రభావం

బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో బడిబయట టీచర్లతో బోధనపై ప్రభావం పడుతోంది. ఎక్కడికి బదిలీ వస్తుంది..? పదోన్నతుల జాబితాలో పేరు ఎక్కడుంది..? ఇలా రకరకాల చర్చల్లో మునిగి తేలుతున్నారు. కాగా, 24 మందిని డిప్యూటేషన్‌ కేటాయించడంపై పెదవి విరుస్తున్నారు. వీరిలో పాఠశాలలను చక్కదిద్దాల్సిన హెచ్‌ఎంలు ఉండడం గమన్హారం. ఉపాధ్యాయులను రిలీజ్‌ చేయకపోవడం వల్ల బడికి డుమ్మా కొడుతున్నారు.

Practice Test: విద్యార్థుల‌కు ప్రాక్టీస్ టెస్ట్‌లు

సర్టిఫికెట్ల పరిశీలనకు నియమించాం

ఆరు టీముల్లో ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. మిగతా వాళ్లందరూ పాఠశాలకు వెళ్తున్నారు. బదిలీ, పదోన్నతుల నేపథ్యంలో అవసరం మేరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విధులు కేటాయించాం. సర్టిఫికెట్ల పరిశీలన, సర్వీసు వెరిఫికేషన్‌, గ్రీవెన్స్‌ పరిశీలన చేశారు. ప్రస్తుతం పని తగ్గడంతో ఒక్కో టీంలో ఒక్కరే ఉన్నారు. ఏ రోజుకు ఆరోజు గ్రీవెన్స్‌ వస్తే డిస్పోజ్‌ చేస్తున్నారు.

– యాదయ్య, డీఈవో

Published date : 23 Sep 2023 04:21PM

Photo Stories