Counselling at Gurukul Schools: తరగతుల సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్
సాక్షి ఎడ్యుకేషన్: 2023–2024 విద్యాసంవత్సరంలో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ఖాళీలు, 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 23న స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 23వ తేదీన లక్సెట్టిపేట్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఉదయం 9 గంటలకు బాలికలు, బాలురకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Employees Strike: ఉద్యోగుల సమ్మేకు తాత్కాలిక విరమణ
ఆదిలాబాద్ రీజనల్ లోని తొమ్మిది బాలికల పాఠశాలలు, ఏడు బాలుర పాఠశాలల్లో ఐదో తరగతిలో 23 ఖాళీలు బాలురకు, నాలుగు బాలికలకు, ఆరో తరగతిలో ఆరు ఖాళీలు బాలురకు, బాలికలకు ఆరు ఖాళీలు, ఏడో తరగతిలో ఆరు బాలురకు, ఆరు బాలికలకు, ఎనిమిదో తరగతిలో బాలురకు మూడు ఖాళీలు, బాలికలకు ఐదు ఖాళీలు, తొమ్మిదో తరగతిలో 21 ఖాళీలు బాలురకు, 17 ఖాళీలు బాలికలకు ఉన్నట్లు తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన వీటీజీసెట్, బీఎల్‌వీసెట్‌లో ఎంపికై , వివిధ కారణాలతో పాఠశాలల్లో జాయిన్ కాని వారికి ముందు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులోనూ ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని స్వరూపారాణి వివరించారు.