Schools: విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయి ఉండాలి
Sakshi Education
సిరిసిల్లఎడ్యుకేషన్: విద్యార్థులలో కనీస అభ్యసన స్థాయిలు ఉండాలని జిల్లా సెక్టోరియల్ అధికారి శైలజా పేర్కొన్నారు. కనీసన అభ్యసన స్థాయిని పెంచడానికి ప్రభుత్వ అమలు చేస్తున్న తొలిమెట్టుపై జిల్లాస్థాయి తొలిమెట్టు రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమానికి డీఈవో హాజరై ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన మండలస్థాయి తొలిమెట్టు రిసోర్స్ పర్సన్లకు స్థానిక గీతానగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణ శిబిరంలో అందుకున్న మెలకువలను పాఠశాల స్థాయిలో అమలు చేయాలన్నారు. గీతానగర్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భాగ్యరేఖ, జిల్లా రిసోర్స్ పర్సన్లు రమానాఽథ్‌రెడ్డి, రవీందర్, శర్మ, భాస్కర్‌పాల్గొన్నారు.
Seva Bharat Trust: విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ
Published date : 27 Jul 2023 03:42PM