Skip to main content

DRDA Assistant Project Director: విద్యార్థులు అదనపు నైపుణ్యం కలిగి ఉండాలి

Students should have additional skills

అనకాపల్లిటౌన్‌: విద్యార్థులు విద్యతో పాటు అదనపు నైపుణ్యం కలిగి ఉండాలని డీఆర్‌డీఏ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సోనీ డైసీ అన్నారు. స్థానిక డైట్‌ కళాశాల ఆవరణలో బుధవారం జిల్లా యువజనోత్సవాలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సెట్విస్‌ అండ్‌ యూత్‌ సర్వీసెస్‌ జిల్లా మేనేజర్‌ కె.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి మాట్లాడుతూ స్వామి వివేకానంద సిద్ధాంతాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఈ యువజనోత్సవాలు జరుపుకోవడం ఎంతో అవసరం అన్నారు. కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ తనకు నచ్చిన రంగంలో రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక గోల్‌ను నిర్దేశించుకోవాలని, కృషి, పట్టుదల ఉంటే సాధించి తీరుతామన్నారు. నృత్యం, పాటలు, పోస్టర్‌, స్టోరీ రైటింగ్‌, ఫొటోగ్రఫీ విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి దాడి రత్నాకర్‌ షీల్డ్‌, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అంతకుముందు వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాఖ నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్‌ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చదవండి: BC Welfare Association: విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి

Published date : 24 Aug 2023 02:46PM

Photo Stories