Good Touch and Bad Touch: గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులకు అవగాహన
విశాఖ విద్య: ప్రతీ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో హెచ్‌ఎం గదికి సమీపంలో అందరికీ కనిపించేలా బాలికల కోసమని ప్రత్యేకంగా ‘భరోసా బాక్స్’ ఏర్పాటు చేశారు. బాక్స్‌కు తాళం వేసి, దానిని ప్రతీ పదిహేను రోజులకోకసారి ఎంఈవో పర్యవేక్షణలోని కమిటీ సభ్యులైన మహిళా పోలీసు, వైద్యారోగ్యశాఖ ఏఎన్‌ఎం సమక్షంలో తెరుస్తున్నారు. ఏమైనా ఫిర్యాదులు లేదా సూచనలు, సలహాలు ఉంటే, వాటిని వేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, పరిష్కారం కోసం సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
చదవండి: Rs 2 lakh incentive for single girl child: ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు
ఇదిగో బాలికా వికాసం
ఆడపిల్ల అంటే గర్భంలోనే చిదిమేసే వారు ఒకప్పుడు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాలికా సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలతో బాలికా వికాసం విరాజిల్లుతోంది. జిల్లాలో ఇంటర్మీయెట్ చదివే వారిలో బాలురు 42,037 మంది ఉంటే, బాలికలు 37,041 మంది ఉన్నారు. 1 నుంచి 10వ తరగతి చూసినట్టయితే అబ్బాయిలు 1,84,295 మంది కాగా, అమ్మాయిలు 1,65,465 మంది ఉన్నారు. 3 నుంచి 6 ఏళ్ల వయస్సులో అబ్బాయిలు 25,740 మంది కాగా, అమ్మాయిలు 25,036 మంది ఉన్నారు. అదే 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు మధ్య వారిలో అబ్బాయిలు 16,715 మంది కాగా, అమ్మాయిలు 16,621 మంది ఉన్నారు. ఈ లెక్కన గతంలో కన్నా క్రమేపీ అమ్మాయిల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
చదవండి: Kids: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..