Reunion of ZP School Students: 44 ఏళ్ల తరువాత విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
Sakshi Education
జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా 44 ఏళ్ల తర్వాత మళ్ళీ వారి పాఠశాలలోనే కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన ఆత్మీయ సమ్మేళనంలో వారంతా పాల్గొని సందడి చేసి, చిందులు వేశారు.
సాక్షి ఎడ్యుకేషన్: స్థానిక జెడ్పీ పాఠశాలలో 1978–79వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. 44 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, ఉప్పొంగిపోయారు. తమ జీవితాల్లో సుఖసంతోషాలు, కుటుంబ యోగక్షేమాల గురించి స్నేహితులతో పంచుకున్నారు.
➤ Achievement Survey Exams: ఆంగ్ల మాధ్యమంలో సర్వే పరీక్షలు
గురువులు చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. మరణించిన స్నేహితుల ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు. అనంతరం సినీ గీతాలకు ఉత్సాహంగా స్టెప్పులేసి సందడి చేశారు. పూర్వ విద్యార్థులు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి జె.శ్రీనివాసరావు, ఆర్‌పీఎఫ్ ఏఎస్సై వావిరాల శ్రీనివాసరావు, బుక్కారపు సంజీవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 30 Oct 2023 02:18PM