Special Syllabus: విద్యాసంస్థల్లో పర్యావరణంపై ప్రత్యేక సిలబస్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి విద్యా సంస్థ ఆధ్రవ్యంలో ఆరు జిల్లాల్లో నిర్వహిస్తున్న కళాశాలలు, పాఠశాలల్లో పర్యావరణంపై ప్రత్యేక సిలబస్‌ను బోధించనున్నట్లు సంస్థ డైరెక్టర్ (పా, ఫైనాన్స్) ఎన్.బలరామ్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొఆన్నరు. ప్రతి తరగతి నుంచి చురుకై న విద్యార్థిని కెప్టెన్‌గా ఎంపిక చేస్తామని, వ్యాయామ ఉపాధ్యా యుల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్ వాచర్స్, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించి సిలబస్ రూపొందిస్తామని తెలిపారు. ప్రతివారం పర్యావరణ హిత కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. కాగా సింగరేణి ఎడ్యుకేషన్ విభాగం జీఎం ఆదివారం అన్ని పాఠశాలలు, కశాశాలలకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
- సింగరేణి డైరెక్టర్ బలరామ్