Central Govt: ‘స్కాలర్‌షిప్’కు బయోమెట్రిక్ తప్పనిసరి
అనంతపురం సిటీ: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపకార వేతనాల మంజూరుకు ఉమ్మడి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్ల బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఉమ్మడి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ రఫీ ఓ ప్రకటనలో తెలిపారు. బయోమెట్రిక్ అథెంటికేషన్ నమోదు చేయకపోతే విద్యార్థుల ఖాతాల్లో ఉపకార వేతనాలు జమకావని పేర్కొన్నారు. అనంతపురం పెన్నార్ భవన్‌లోని సీపీఓ మీటింగ్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల్లోపు నమోదు చేయడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతపురం, రాప్తాడు, శింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాల్లోని పాఠశాల, కళాశాలల హెచ్‌ఓడీలు నేషనల్ స్కాలర్‌షిప్ ఎన్‌ఎస్‌పీ యూజర్ ఐడీ తీసుకుని ఆదార్ అథెంటికేషన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీనివాస డిగ్రీ కళాశాలలో (ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాలు), హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల వారు హిందూపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అజీజియా మునిసపల్ ఉర్ధూ హైస్కూల్‌లో, కదిరి, నల్లచెరువు, తనకల్లు, గాండ్లపెంట, తలుపుల, ఎన్‌పీ కుంటకు సంబంధించిన వారు కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలన్నారు.
Rural Development Trust: ప్రతిభకు ప్రోత్సాహం.. అన్నీ ఉచితమే...