Skip to main content

Rural Development Trust: ప్రతిభకు ప్రోత్సాహం.. అన్నీ ఉచితమే...

free training sports in rural development trust andhra pradesh

అనంతపురం: ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ అనంతపురంలో ఏర్పాటు చేసిన అనంత క్రీడా గ్రామం క్రీడాకారులకు కల్పతరువుగా మారింది. అంతర్జాతీయస్థాయి క్రీడలకు వేదిక కావడమే కాదు వేలాది మంది క్రీడాకారులను జాతీయస్థాయికి అందించిన ఘనత ఆర్డీటీ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు)కే దక్కుతుంది. ఫుట్‌బాల్‌ , హాకీ, సాఫ్ట్‌బాల్‌, క్రికెట్‌, టెన్నిస్‌లో రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా ఫుట్‌బాల్‌ క్రీడను అభివృద్ధి పరిచేలా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 28 క్లబ్‌లు ఏర్పాటు చేశారు.

అన్నీ ఉచితమే...
ప్రతిభ ఉండి అవకాశాలను అందిపుచ్చుకోలేని గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభ వెలికి తీసేందుకు అనంతపురం ఆర్డీటీ క్రీడాగ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్‌ క్లబ్‌లకు ఆరు నెలల పాటు పరస్పరం పోటీలు నిర్వహిస్తారు. ప్రతి వారం మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన 40 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ కల్పిస్తారు. 10, 11, 12 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులను ఎంపిక చేస్తారు. డిగ్రీ, పీజీ వరకు ఉచితంగా చదువుతో పాటు రెసిడెన్షియల్‌ శిక్షణ కల్పిస్తారు. నయాపైసా ఫీజు వసూలు చేయరు. టోర్నమెంట్‌లకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఖర్చులు సైతం ఆర్డీటీనే భరిస్తోంది. ఆరో తరగతిలో రెసిడెన్షియల్‌ అకాడమీలో చేరితే డిగ్రీ, పీజీ వరకు ఉచితంగా రెసిడెన్షియల్‌ విద్యను అందిస్తారు.

 

National Pest Control Day: శారీరకంగా, మానసికంగా ఎదగాలి: కలెక్టర్‌ భవేష్‌మిశ్రా

ఇప్పటి దాకా 2 వేల మందికి...
గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్‌బాల్‌పై పెరుగుతున్న ఆసక్తి మేరకు విన్సెంట్‌ ఫెర్రర్‌ ఫౌండేషన్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ), లాలిగా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళల ఫుట్‌బాల్‌ విభాగాన్ని ప్రోత్సహిస్తున్నారు. 7–15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 2 వేల మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పటికే ఫుట్‌బాల్‌లో మెరుగైన క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకున్నారు.

మహిళా ఫుట్‌బాల్‌కు ప్రోత్సాహం..
మహిళా ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు ఆర్డీటీ తరుఫున అనంతపురం ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఏఎఫ్‌ఎల్‌), సూపర్‌ లీగ్‌, మిక్స్‌–జెండర్‌ లీడ్‌ కప్‌ టోర్నీలను నిర్వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌ ద్వారా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే టోర్నమెంట్‌ మిక్స్‌డ్‌ జెండర్‌ కప్‌. మహిళా ఫుట్‌బాల్‌పై ఆసక్తి ఏర్పరచుకునేలా స్పెయిన్‌ దేశానికి చెందిన ప్రతినిధులు ప్రత్యేక ఫౌండేషన్‌ లాలీగా ఏర్పాటు చేశారు.

Sports: విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి

జాతీయస్థాయిలో ప్రతిభ ..
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు జాతీయస్థాయిలో ప్రతిభ చూపారు. రవి (ఆత్మకూరు), విష్ణువర్ధన్‌ (కళ్యాణదుర్గం), ప్రమిత్‌ (అనంతపురం) వీరసాయి (ఆత్మకూరు), ప్రమిత్‌ (కళ్యాణదుర్గం), మహబూబ్‌బాషా, దిలీప్‌, శ్రీహరి (గుత్తి), గౌతమి, మౌనిక (గుత్తి), శోభ, అంజలి, మీనాక్షి, ప్రవళ్లిక (కళ్యాణదుర్గం), హేమశ్రీ, మౌనిక, ఆశాబీ, లక్ష్మీ (ఆత్మకూరు) దేశంలో వివిధ చోట్ల జరిగిన జాతీయ ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు.

Published date : 05 Aug 2023 03:15PM

Photo Stories