September 14, 15 Schools Holidays : రేపు, ఎల్లుండు స్కూల్స్‌కు సెలవులు.. కారణం ఇదే..
అలాగే మరో వైపు పండుగల సందర్భంగా కూడా విద్యా సంస్థలకు భాగానే సెలవులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణలోని విద్యాసంస్థలకు వరుసగా మరో రెండు రోజులు పాటు సెలవులు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 14,15వ తేదీల్లో (గురువారం, శుక్రవారం) తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.
కారణం ఇదే..
అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ వరుసగా వివిధ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులో తెలంగాణ టెట్ (TS TET) కూడా పరీక్ష జరగనుంది. కనుక టెట్ పరీక్ష నేపథ్యంలో.. ఎగ్జామ్ సెంటర్స్ పడిన స్కూళ్లకు మాత్రమే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. టెట్ సెంటర్లలో 14వ తేదీన (గురువారం) హాఫ్ డే స్కూల్ మాత్రమే నిర్వహించనున్నారు. ఇక పరీక్ష జరిగే 15వ తేదీన(శుక్రవారం) ఆయా స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
పరీక్షల సమయం ఇలా..
తెలంగాణ టెట్ రెండు పేపర్లుగా అంటే.. పేపర్ -1, పేపర్ -2గా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన జరగనున్న టెట్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
భారీగా దరఖాస్తులు..
టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేసింది.. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టెట్‌లో అర్హత సాధించినవారికే డీఎస్సీ, గురుకుల లాంటి వివిధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు అర్హులు కావడంతో.. తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు కాబోయే టీచర్లు.
పరీక్ష కేంద్రాలు ఇలా..
ఈ ఏడాది పేపర్-1కి 1,139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్ష కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 92 పరీక్షా కేంద్రాలు, ములుగు జిల్లాలో అత్యల్పంగా 8 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
పరీక్ష విధానం :
ఈసారి కూడా టెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకం కోసం పేపర్-1 నిర్వహిస్తారు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించేందుకు పేపర్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 1-8 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు, పేపర్-2 పరీక్షలో 6-10 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు ఉంటాయి.
టెట్ పరీక్ష హాజరయ్యే అభ్యర్థులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా..
☛ టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి.
☛ పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసేబిలిటీ తదితర వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి.
☛ హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా లేకపోతే అభ్యర్థుల ఇటీవలి తాజా ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకొని, ఆధార్ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో పర్మిషన్ అనంతరమే పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయం తీసుకుంటారు.
పరీక్షాకేంద్రం చిరునామాను ఒకరోజు ముందుగానే సంప్రదించడం ఉత్తమం.
Tags
- TS Schools Holidays
- September 14th and 15th Schools Holidays
- due to tet exam schools holidays
- due to tet exam schools holidays in telangana
- september school holidays in telangana
- TET Exam
- due tet exam school holidays news telugu
- tomorrow school holiday in telangana telugu news
- tomorrow school holiday in telangana
- two days schools holidays in telangana
- two days schools holidays in telangana telugu news
- two days schools holidays telugu news