Skip to main content

Telangana Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణలో భారీగా దసరా, బతుకమ్మ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో అత్యంత వైభవంగా.. ఎక్కువ రోజులు పాటు జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అలాగే ద‌స‌రా పండ‌గ‌తో పాటు వ‌చ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటారు.
Telangana Schools and Colleges Dasara Holidays News in Telugu
TS Schools and Colleges Dasara Holidays

అందుకే స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌ల‌కు ముందుగానే హాలీడేస్‌ను ప్ర‌భుత్వం మంజూరు చేస్తుంది. ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివ‌రాల‌ను విద్యాశాఖ ముందుగానే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

పాఠశాలల పునఃప్రారంభం తేదీ ఇదే..

telangana bathukamma and dasara holidays 2023 telugu news

తెలంగాణ‌లో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా.. ఈ ఏడాది మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26వ తేదీన (గురువారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెల‌వుల పూర్తి వివ‌రాల‌ను పాఠశాల విద్యాశాఖ పొందిప‌రిచిన విష‌యం తెల్సిందే.  అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు త‌మ క్యాలెండర్‌లో సెల‌వులను పొందుప‌రిచారు.

☛ School & Colleges Holiday list in September 2023 : సెప్టెంబ‌ర్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్‌ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.

2023-24లో తెలంగాణలోని స్కూల్స్‌ సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే ఇలా..:

ts schools holidays detals 2023 telugu news

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 12 Sep 2023 02:25PM

Photo Stories