SCERT: విద్యాసామగ్రితో బోధించాలి... తొలిమెట్టు కార్యక్రమం అమలు
నిర్మల్ రూరల్: విద్యార్థులకు తరగతి గదిలో అభ్యసన సామగ్రితో బోధించాలని ఎస్సీఈఆర్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సువర్ణ వినాయక్ సూచించారు.
జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్లో మంగళవారం మండల స్థాయి తెలుగు సబ్జెక్టు రిసోర్స్ పర్సన్‌లకు తొలిమెట్టుపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.
TET Exam: TET పరీక్షలో వీటికి అనుమతి లేదు..
జిల్లా విద్యాశాఖ, రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేసే విధంగా మండలంలో ఉపాధ్యాయులందరికీ అవగాహన కల్పించాలన్నారు.
డీఈవో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటలతో పాటు అభ్యసన సామర్థ్యాలు ముఖ్యమన్నారు. ఇందులో ఎస్‌వో నరసయ్య, ఎంఈవో శంకర్, రూమ్ టు రీడ్ ప్రతినిధులు శ్రీహర్ష, గోనె రవి, శిక్షణ అందిస్తున్న జిల్లా రిసోర్స్ పర్సన్స్ సంగీత, గోపాల్ పాల్గొన్నారు.
TET 2023: ఈ జిల్లాలో పేపర్–1కు 7,200 మంది... పేపర్–2 పరీక్షకు 6,664 అభ్యర్థులు!