Skip to main content

TET 2023: ఈ జిల్లాలో పేపర్‌–1కు 7,200 మంది... పేపర్‌–2 పరీక్షకు 6,664 అభ్యర్థులు!

సెప్టెంబర్‌ 15న పరీక్ష, 27న ఫలితాలు విడుదల కానున్నాయి. పేప‌ర్‌-1 మొత్తం 150 మార్కులు, పేప‌ర్‌-2 150 మార్కుల‌కు ఉంటుంది.
TS TET 2023

దురాజ్‌పల్లి (సూర్యాపేట): జిల్లాలో టెట్‌(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను పకడ్బందీగా నిర్వహించాలని, పేపర్‌–1కు 31 కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు.

TS TET 2023 Environmental Science Bitbank: టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

ఈనెల 15న టెట్‌ను పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు సీహెచ్‌. ప్రియాంక, ఎ.వెంకట్‌ రెడ్డితో కలిసి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పేపర్‌–1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని కోసం సూర్యాపేటలో 7,200 మంది అభ్యర్థులకు 30 కేంద్రాలు, కోదాడలో 197 మంది అభ్యర్థులకు ఒక కేంద్రం ఇలా మొత్తం 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

TS TET 2023 Child Development & Pedagogy Bitbank: టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు నిర్వహించే పేపర్‌–2 పరీక్షకు సూర్యాపేటలో 28 కేంద్రాలు, కోదాడలో 1 కేంద్రం ఇలా మొత్తం 29 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్ష కోసం సూర్యాపేటలో 6,654 మంది, కోదాడలో 10 మంది ఇలా మొత్తం 6,664 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

పరీక్ష నిర్వహణకు ఆరు రూట్లు ఏర్పాటు చేశామని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. పరీక్ష రోజు అన్నికేంద్రాల వద్ద 144 సెక్షన్‌ తప్పక అమలు చేయాలని, నిరంతర విద్యుత్‌, మంచినీరు, ఏఎన్‌ఎంతో మెడికల్‌ స్టాల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రూట్ల వారీగా బస్సులు నడపాలని ఆదేశించారు.

TS TET 2023 Child Development & Pedagogy Bitbank: టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

ముందుగా చీఫ్‌ సూపరింటెండెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు 31 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 123 మంది హాల్‌ సూపరింటెండెంట్లు, 309 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఈఓ అశోక్‌, డీఎస్పీ రవి పాల్గొన్నారు.

Published date : 12 Sep 2023 04:35PM

Photo Stories