Skip to main content

TET Exam: TET పరీక్షలో వీటికి అనుమతి లేదు..

TET exam
TET exam

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ఉపాధ్యాయ అర్హ త పరీక్ష(టెట్‌) పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ వేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డీఈవో అశోక్‌, ఆర్డీవో సురేశ్‌తో కలిసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదన పు కలెక్టర్‌ మాట్లాడుతూ టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షకు ఒకరోజు ముందే కేంద్రాలను పరిశీలించాలన్నారు. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రానిక్‌ వస్తువులు లోపలికి అనుమతించొద్దన్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో పేపర్‌ 1 పరీక్షకు 21 సెంటర్లు, పేపర్‌ 2కు 10 సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల కోఆర్టినేటర్‌ ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Published date : 12 Sep 2023 05:21PM

Photo Stories