Skip to main content

Girls Sainik School: ఉత్తమ ఫలితాలతో విశ్వం విద్యార్థుల ప్రభంజనం

ఇటీవలె నిర్వహించిన సైనిక్‌ పాఠశాల ప్రవేవ పరీక్షల్లో ఎంతోమంది విద్యార్థులు పాల్గొని పరీక్షను రాసారు. అయితే, అందులోంచి ఈ విశ్వం విద్యాసంస్థ విద్యా‍ర్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు..
Students of Visvam Vidyasthan Tirupati achieves best results in Entrance exam

తిరుపతి: కిట్టూరు బాలికల సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు వంశిత శ్రీ, మనోజ్ఞ భాయ్‌, సోనిక, ధర్షిణిశ్రీ, నిత్యశ్రీ, వర్షిణి బాలికల సైనిక్‌ స్కూల్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

Tenth Spot Valuation: ఈ కేంద్రంలో పరీక్షల మూల్యాంకనం.. 1200 మంది ఉపాధ్యాయుల నియామకం..!

గత 34 ఏళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ, మిలిటరీ స్కూల్స్‌ వంటి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధిస్తుండడం తమ విద్యాసంస్థలకే గర్వకారణమన్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్‌ ఎన్‌.తులసి, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశ్వచందన్‌రెడ్డి అభినందించారు.

SSC Exam Evaluation:ఎస్‌ఎస్‌సీ పరీక్షలు పూర్తి.. స్పాట్‌ వ్యాల్యూవేషన్‌కి తేదీ..!

Published date : 31 Mar 2024 01:43PM

Photo Stories