Online Competitions for Students : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో.. విద్యార్థులకు ఆన్‌లైన్ పోటీలు..
Sakshi Education
భూపాలపల్లి అర్బన్: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని యాజమాన్య పాఠశాల విద్యార్థులకు వీరగాధ 3.0 పేరిట ప్రత్యేక పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాంకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పోటీలను 3నుంచి 5వ తరగతి, 6నుంచి 8వ తరగతి, 9, 10 తరగతులు, 11, 12 తరగతులుగా విభజించారు. పద్యాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన, స్వాతంత్ర సమరయోధులు, దేశ రక్షణలో భాగస్వాములైన వారి త్యాగాల జీవిత చరిత్ర, తదితర అంశాలపై పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఇన్నోవేషన్.ఇండియా.గౌ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 23 Sep 2023 05:59PM