Skip to main content

Anganwadi Facilities News: అంగన్‌వాడీలో ఈ సౌకర్యాలు కచ్చితంగా ఉండాల్సిందే...

anganwadi news  District Collector DK Balaji inspecting Anganwadi center  District Collector DK Balaji inspecting Anganwadi center
anganwadi news

గూడూరు: మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పటాన్‌పేట, జమీ రామరాజుపాలెం అంగన్‌వాడీ కేంద్రాలను ఐసీడీఎస్‌ అధికారులతో కలిసి విస్తృతంగా తనిఖీ చేశారు.

అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ ఎందుకంటే..Click Here

హాజరుపట్టీ, పిల్లల బరువు, ఎత్తు నమోదు రిజిస్టర్‌, ఆహార పదార్థాల స్టాకు రిజిస్టర్‌, వ్యాక్సినేషన్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. నమోదు చేసిన ప్రకారం చిన్నారుల బరువు, ఎత్తులను స్వయంగా సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న టీహెచ్‌ఆర్‌ సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

రామరాజుపాలెంలో గృహ సందర్శన రిజిస్టర్‌ లేకపోవడం పట్ల కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో రిజిస్టర్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రెండు కేంద్రాల్లోని సిబ్బందికి షోకాజ్‌ జారీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రోత్‌ రిజిస్టర్‌లో ప్రతినెలా 5వ తేదీలోగా పిల్లల ఎదుగుదల నమోదు చేయాలని ఆదేశించారు.

టీహెచ్‌ఆర్‌ సక్రమంగా అందించాలి...

బాలింతలు, గర్భిణులకు టేక్‌ హోం రేషన్‌ (టీహెచ్‌ఆర్‌)లో భాగంగా పాలు, గుడ్లు, ఖర్జూర, నూనె, బియ్యం, పప్పు తదితర ఆహార పదార్థాలు సక్రమంగా అందించాలని స్పష్టం చేశారు. ఐరన్‌ మాత్రలతో పాటు పోషకాహారం తీసుకునేలా చూడాలని సూచించారు.

సర్పంచ్‌ పరసా రాజులు, ఐసీడీఎస్‌ పీడీ ఎస్‌.సువర్ణ, సీడీపీఓ గ్లోరి, సూపర్‌వైజర్లు ఉషశ్రీ, రేవతి తదితరులు పాల్గొన్నారు. రామారాజుపాలెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ డీకే బాలాజీ విద్యార్థులతో మమేకం అయ్యారు.

2వ తరగతి విద్యార్థి అభయ్‌ తేజకు చిన్న చిన్న కూడికలు ఇచ్చి చేయించారు. మధ్యాహ్న భోజనం మెనూలో అన్నం, గోంగూర, పప్పు, చిక్కి, ఉడికించిన గుడ్డు విద్యార్థులకు అందించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఎంఈవో బి.ఎస్‌.సి.శేఖర్‌ సింగ్‌, తహసీల్దారు ఎస్‌.ఎస్‌.శాంతి, మార్క్‌ఫెడ్‌ డీఎం మురళీ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 29 Jul 2024 08:37AM

Photo Stories