Skip to main content

November 30th All Schools Bandh : న‌వంబ‌ర్ 30వ తేదీన స్కూల్స్ బంద్‌.. కార‌ణం ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌కు న‌వంబ‌ర్ 30వ తేదీన (శ‌నివారం) బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని స్కూల్స్ ఎలుండి బంద్ ఉంటుంద‌ని ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర క‌మిటీ ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలపై ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గానే ఈ బంద్ చేస్తున‌ట్టు తెలిపింది.
November 30th All Schools Bandh

వెంట‌నే తెలంగాణ‌లో విద్యాశాఖ మంత్రిని నియ‌మించాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో, హాస్ట‌ళ్లు, గురుకులాల్లో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేసింది.

ప్ర‌భుత్వం ఈ ఘటనపై...
తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్‌ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతకుమారి న‌వంబ‌ర్ 28వ తేదీన (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్‌, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు. ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్‌ సేఫ్టీ పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో హెడ్‌మాస్టర్‌, స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్‌ రూం, కిచెన్‌  పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్‌ వైజ్‌ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమ‌న్నాంటే...?

cm revanth reddy

తెలంగాణలోని పలు ప్రభుత్వ స్కూల్స్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్కూల్స్, గురుకులాలను తరుచూ తనిఖీ చేయాలి. పరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందించాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లఓ్యం వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

హైకోర్టు సైతం..
తెలంగాణలో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి అన్ని వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగనుంది. 

మంత్రి సీతక్క ఏమ‌న్నాంటే...?
మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు.

2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

2025 జనవరి  :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ క‌నుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26

ఫిబ్రవరి 2025 : 

☛➤ మహ శివరాత్రి : 26

మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31

ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి :  05
☛➤ శ్రీరామ నవమి :  06
☛➤ అంబేడ్కర్ జయంతి :  14
☛➤ గుడ్ ఫ్రైడే :  18

మే 2025 :
మేడే : 1

జూన్ 2025 :
☛➤ బక్రీద్ :  07

జూలై :  2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21

ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27

సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21

అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20

నవంబర్  2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05

డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26

2025 జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి సెల‌వుల వివ‌రాలు ఇవే...

Published date : 28 Nov 2024 06:03PM

Photo Stories