Skip to main content

10th Exam Pattern Changes 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. టెన్త్ ప‌రీక్ష‌ల్లో కీల‌క మార్పులు చేసిన ప్ర‌భుత్వం.. ఇక‌పై..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌భుత్వ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా విధానంలో కీల‌క మార్పులు చేసింది. ఇకపై 100 మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
Telangana10th Class Exam Pattern Changes 2024

2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు తెలంగాణలో టెన్త్‌ మార్కుల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 

➤☛ CBSE Board Exams 2025 : ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలు

టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే...?
ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు మార్చి చివ‌రి వారంలో లేదా ఏప్రిల్ నెల‌లో జర‌గ‌నున్నాయి. టెన్త్ ఇంట‌ర్న‌ల్ మార్కుల్లో ఎక్క‌వ‌గా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌నే ఫిర్యాదులు రావ‌డంతో.. ప్ర‌భుత్వం ఈ మేర‌కు కీల‌న నిర్ణ‌యం తీసుకంది.

ఇదీ చదవండి:  TS 10th Class Previous Papers

2024-25 విద్యా సంవత్సరం నుంచే..
ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్‌ మార్కులు, 80 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్న విష‌యం తెల్సిందే. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

TG 10th Class Study Material :

Published date : 28 Nov 2024 08:23PM

Photo Stories