Government Schools : పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాలేదు.. ఒక్క విద్యార్థి ఫెయిల్ అయినా కూడా!
అనంతపురం: ‘రేకుల షెడ్లలో నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్లకు వేలాది రూపాయల ఫీజులు కట్టి పిల్లలను పంపుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. బెస్ట్ టీచర్లు, బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి. మరి ఫలితాల్లో బెస్ట్ ఎందుకు ఉండడం లేదు’ అని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అనంతపురం రూరల్ పరిధిలోని సీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఎంఈఓలు, హెచ్‌ఎంలకు జరగుతున్న ‘లీడర్‌షిప్’ శిక్షణను పరిశీలించారు.
Job Mela : ప్రభుత్వ ఐటీఐలో రేపు జాబ్ మేళా.. విద్యార్హతలు ఇవే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకత్వ లోపాలతోనే పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నది వివిధ సర్వేల్లో తేలిందన్నారు. దీంతో శిక్షణ అనేది దేశ వ్యాప్తంగా తప్పనిసరి చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సి ఉందన్నారు. లేదంటే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో ప్రస్తుతం దాదాపు 45 యాప్‌లు ఉన్నాయని, అన్నీ కలిపి ఒక ట్రెండ్ యాప్‌లు చేసేలా చూస్తున్నామని చెప్పారు.
Government Schools: ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
ఈ రెండు యాప్‌లలోనే అన్ని అంశాలూ ఉంటాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అయినా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ ప్రసాద్‌బాబు, ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్, సమగ్రశిక్ష ఏపీసీ నాగరాజు, ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఓ నాగరాజు, సీఎంఓ గోపాలకృష్ణ పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)