Telangana Schools and Colleges Holidays : తెలంగాణలో జూలై 12వ తేదీన స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకంటే..?
ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) పలు నిరసన కార్యక్రమాలను ఇప్పటికే కొనసాగిస్తోంది.
తెలంగాణలోనూ గత నెలలో కూడా బంద్ నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరో సారి తెలంగాణలో విద్యా రంగంలో జరుగుతోన్న అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్) నిర్ణయించింది. ఇందులో భాగంగానే జులై 12వ తేదీన (బుధవారం) విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.
విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ..
ఏఐఎస్‌ఎఫ్ నాయకులు హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమాశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నాయకులు విమర్శించారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయడం లేదంటూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ఆరోపించారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిలంచాలని, స్కూల్ ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో జులై 12వ తేదీ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌లో పరీక్షలు- సెలవులు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.