Skip to main content

Telugu Talent Test: తెలుగు ప్ర‌తిభ ప‌రీక్ష‌లో మ‌రుపాక విద్యార్థి ద్వితియ స్థానం..

ఏటా నిర్వ‌హించే ఈ తెలుగు ప్ర‌తిభ ప‌రీక్ష‌లో ఈ ఏడాది మ‌రుపాక విద్యార్థి రాష్ట్ర‌స్థాయిలో త‌న ప్ర‌తిభ‌ను చూపాడు. ఈ నేప‌థ్యంలో విద్యార్థిని అంద‌రూ అభినందించారు..
Celebrating success in Telugu talent competition. State-level recognition for Telugu talent.,Satya Swaroop receiving award in Hyderabad, Talented Marupaka student at the state level event.,
Satya Swaroop receiving award in Hyderabad

సాక్షి ఎడ్యుకేష‌న్: మండలంలోని మరుపాక మోడల్‌ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి సాసుబిల్లి సత్యస్వరూప్‌ తెలుగు ప్రతిభ పరీక్షలో ద్వితీయ స్థానం సాధించాడు. ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలో మన రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. మన సంస్కృతి నెట్‌వర్క్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఏటా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పదో తరగతి విద్యార్ధులకు ఆన్‌లైన్లో తెలుగు ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తుంటారు.

➤   Employment Offer: వీరికి మాత్ర‌మే స‌బార్డినేట్ పోస్టులు.. కానీ..!

ఇందులో భాగంగా గత నెల 10న ఈ పరీక్ష నిర్వహించగా, పలు పాఠశాలల నుంచి ఎంతో మంది విద్యార్థులు రాశారు. ఆ పరీక్షలో చినపాచిల గ్రామానికి చెందిన సాసుబిల్లి మహేష్‌ కుమారుడు సత్యస్వరూప్‌ మంచి ప్రతిభ చూపాడు. రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఇందుకుగానూ, హైదరాబాద్‌లోని ఒక కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు, కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు సన్మానించి నగదు బహుమతి అందించారు. ఇంతటి ప్రతిభ చూపిన ఆ విద్యార్థిని పలువురు అభినందించారు.
 

Published date : 03 Nov 2023 01:22PM

Photo Stories