'KAUSHAL' Competitions 2023: పాఠశాల విద్యార్థులకు 'కౌశల్' పోటీలు..
సాక్షి ఎడ్యుకేషన్: భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ శాసన సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌశల్ –2023 పరీక్షకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా విద్యాధికారి శ్రీరామ్ పురుషోత్తం అన్నారు. తన కార్యాలయంలో గురువారం ఆయన కౌశల్–2023 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌశల్ సైన్స్ క్విజ్ పోటీకి హాజరయ్యేవారు 8, 9, 10 తరగతుల విద్యార్థులు ప్రత్యేక టీమ్‌గా ఏర్పడాలన్నారు.
➤ BEL Recruitment 2023: బెల్‌లో 232 ఇంజనీర్ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..
క్విజ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు పోటీలో పాల్గొనేందుకు తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. సిలబస్‌గా 8, 9, 10 తరగతుల గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం, విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయుల కృషి అంశాలను నిర్ణయించారన్నారు. ప్రాథమిక పరీక్ష డిసెంబర్ 6, 7, 8 తేదీలలో ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు. జిల్లాస్థాయి పోటీలు డిసెంబర్ 20వ తేదీన, రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 30వ తేదీన జరుగుతాయన్నారు. క్విజ్‌లో పాల్గొనదలచిన విద్యార్థులు నవంబరు 5వ తేదీ లోపు ww.bvmap.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల విజేతలకు బహుమతులు గవర్నర్ చేతుల మీదుగా అందచేయబడతాయన్నారు. అర్హులైన విద్యార్థులంతా కౌశల్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం జిల్లా కో–ఆర్డినేటర్ మధుమతి ని 8985541699 నంబరులో, జిల్లా జాయింట్ కో–ఆర్డినేటర్ గోవింద నాగరాజు ను 90005 74457 నంబరులో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకుడు శ్రీనివాసరాజు, ఏపీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు నరసింహులు, జిల్లా సైన్స్ అధికారి ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.